03/11/2026, Tuesday · 08:59:21 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

కలువాయి అభివృద్ధికి కృషి చేస్తాం.. జడ్పీటీసీ అభ్యర్థి ఆరవ లిఖిత.

shafi 03/11/2026 7:39 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 4

కలువాయి అభివృద్ధికి కృషి చేస్తాం.. జడ్పీటీసీ అభ్యర్థి ఆరవ లిఖిత.
Want this news as a newspaper clip?Print News Clip

కలువాయి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తామని టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆరవ లిఖిత పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి మాలే రామారావుతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారానికి గ్రామ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా టీడీపీ సైకిల్ గుర్తుకు, జనసేన గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు. అనంతరం అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ కలువాయి మండల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మనోహర్, రమేష్, టీడీపీ నాయకులు రవి, వెంకటేశ్వర్లు, రాజేష్, వెంకట సుబ్బయ్య, వెంకటరెడ్డిపల్లి, కుల్లూరు, రాజుపాలెం గ్రామాలకు చెందిన టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి.

కలువాయి అభివృద్ధికి కృషి చేస్తాం.. జడ్పీటీసీ అభ్యర్థి ఆరవ లిఖిత.
కలువాయి అభివృద్ధికి కృషి చేస్తాం.. జడ్పీటీసీ అభ్యర్థి ఆరవ లిఖిత.
కలువాయి అభివృద్ధికి కృషి చేస్తాం.. జడ్పీటీసీ అభ్యర్థి ఆరవ లిఖిత.

Sixth WritstrivedevelopmentKaluwaiZPTCCandidate

About the author

S

shafi

Reporter

22 Posts

Latest News