02/11/2026, Monday · 03:35:42 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

సర్వేపల్లిలో కూటమి క్లీన్ స్వీప్ ఖాయం..

Kadiyala Chinmaya Reddy 02/11/2026 2:46 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 1

సర్వేపల్లిలో కూటమి క్లీన్ స్వీప్ ఖాయం..
Want this news as a newspaper clip?Print News Clip
  • ఐదు జెడ్పీటీసీలతో పాటు ఐదు ఎంపీపీలను కైవసం చేసుకుంటాం..
  • కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అద్భుత స్పందన..
  • వైసీపీ పని అయిపోయింది..
  • పులివెందులలోనే అభ్యర్థులు దొరకని పరిస్థితి
  • వెంకటాచలం మండలంలోని తిక్కవరప్పాడు, సర్వేపల్లి, ఈదగాలి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

వెంకటాచలం,(అక్షర దర్శిని): 

పరిషత్ ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో పాటు ఐదు జెడ్పీటీసీ స్థానాలు, ఐదు ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయబోతున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని తెలిపారు.

వెంకటాచలం మండలంలోని తిక్కవరప్పాడు, సర్వేపల్లి, ఈదగాలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జెడ్పీటీసీ అభ్యర్థి దారా అన్నమ్మతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. పేదలు, రైతుల సంక్షేమం కోసం రాజీలేకుండా పనిచేయడం తన బాధ్యత అని అన్నారు. 2018లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 70 వేల ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములను డీకేటీ పట్టాలుగా మార్చి చరిత్ర సృష్టించామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బోగోలు మండలానికి తీసుకొచ్చి ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఏడు వేల ఎకరాలకు పైగా భూములను డీకేటీ పట్టాలుగా మార్చామని, లబ్ధిదారుల్లో అత్యధికులు దళితులు, గిరిజనులేనని పేర్కొన్నారు. ఒక్క ఈదగాలి గ్రామంలోనే 500 ఎకరాలకు డీకేటీ పట్టాలు అందించామని, నేడు ఆ రైతులు భూములపై యాజమాన్య హక్కులు పొందడంతో పాటు అన్నదాత సుఖీభవ వంటి పథకాల ప్రయోజనాలను పొందుతున్నారని వివరించారు.

రూర్బన్ పథకం ద్వారా ప్రతి పంచాయతీలో కోట్లాది రూపాయలతో సిమెంట్ రోడ్లు నిర్మించడంతో పాటు తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేశామని చెప్పారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకుడినని స్పష్టం చేశారు.

వైసీపీ పాలనపై విమర్శలు గుప్పిస్తూ.. ఏ గ్రామానికి వెళ్లినా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అరాచకాలు ప్రజలకు గుర్తున్నాయని అన్నారు. ఇరిగేషన్ శాఖలో పనులు చేయకుండానే రూ.150 కోట్లకు పైగా దోచుకున్నారని, షట్టర్లు బిగించకుండానే కోర్టుల్లో కేసులు వేసి రూ.7 కోట్ల వరకు బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. సవిటి కాలువలను సైతం వదలకుండా రూ.26 కోట్ల నుడా నిధుల్లో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.

వైసీపీ పని అయిపోయిందని, చివరకు పులివెందులలోనే అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. అక్రమ మైనింగ్‌లు చేయడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీయడం, దళితులు, గిరిజనుల భూములను ఆక్రమించడం వంటి పనులు తమకు తెలియవని అన్నారు. తాము సంపాదించిన ఆస్తులను అమ్ముకున్నామే తప్ప ఎప్పుడూ ఇతరుల ఆస్తులపై కన్నేయలేదని వ్యాఖ్యానించారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలుస్తున్నారని, రాబోయే పరిషత్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి :: అల్లీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సోమిరెడ్డి

సర్వేపల్లిలో కూటమి క్లీన్ స్వీప్ ఖాయం..
సర్వేపల్లిలో కూటమి క్లీన్ స్వీప్ ఖాయం..
సర్వేపల్లిలో కూటమి క్లీన్ స్వీప్ ఖాయం..

svip khayamsarvepallilokutamiklin

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

83 Posts

Latest News

మురాసు తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అయ్యప్ప పులివెందులలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం. పాతపాడు, ఓబులయపల్లిలో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం మాముడూరులో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం బీసీ లే పార్టీకి వెన్నుముక... సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి . బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు..! చిన్న పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం అల్లీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సోమిరెడ్డి బహుజనులు రాజ్యాధికారం సాధించాలి.. అంబేద్కర్ ఆశయాలను నిజం చేయాలి – నిజమాల ప్రసాద్