01/11/2026, Sunday · 06:12:59 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

బహుజనులు రాజ్యాధికారం సాధించాలి.. అంబేద్కర్ ఆశయాలను నిజం చేయాలి – నిజమాల ప్రసాద్

shafi 01/11/2026 3:39 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 2

బహుజనులు రాజ్యాధికారం సాధించాలి.. అంబేద్కర్ ఆశయాలను నిజం చేయాలి – నిజమాల ప్రసాద్
Want this news as a newspaper clip?Print News Clip

నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు సెగ్మెంట్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీటీసీ అభ్యర్థి చింతల రవీంద్ర ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుసుకుంటూ బహుజనుల అభ్యున్నతి, రాజ్యాధికార సాధన కోసం బీఎస్పీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఏడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిజమాల ప్రసాద్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజనులు రాజ్యాధికారం సాధించాలని కలలు కన్నారని, ఆ మహనీయుడి ఆశయాలను నిజం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే కొనసాగుతోందని, సమాజంలోని అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం దక్కి, పాలనలో భాగస్వాములు అయినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని పేర్కొన్నారు. బహుజనులకు రాజకీయ ప్రాతినిధ్యం, సమాన హక్కులు, సామాజిక న్యాయం దక్కాలంటే ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కుల్లూరు సెగ్మెంట్ బీఎస్పీ అభ్యర్థి చింతల రవీంద్రను గెలిపించి బహుజనుల రాజ్యాధికార సాధనకు మద్దతు తెలపాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :: ఆదురుపల్లిలో పిడుగుపాటు.. స్వీట్ షాప్ గోడౌన్ చిమ్నీ ధ్వంసం

బహుజనులు రాజ్యాధికారం సాధించాలి.. అంబేద్కర్ ఆశయాలను నిజం చేయాలి – నిజమాల ప్రసాద్
బహుజనులు రాజ్యాధికారం సాధించాలి.. అంబేద్కర్ ఆశయాలను నిజం చేయాలి – నిజమాల ప్రసాద్
బహుజనులు రాజ్యాధికారం సాధించాలి.. అంబేద్కర్ ఆశయాలను నిజం చేయాలి – నిజమాల ప్రసాద్

kingship AmbedkarMultiplepeopleattainaspirationstrueNizamalaPrasad

About the author

S

shafi

Reporter

17 Posts

Latest News

బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు..! చిన్న పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం అల్లీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సోమిరెడ్డి అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సామాన్య ఓటర్లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు: కాకాణి రాపూరు బిట్‌-2లో వైసీపీ అభ్యర్థి మేరీగ సుమతికి మద్దతుగా ఓటర్ల విస్తృత ప్రచారం రాపూరు బిట్‌-2లో వైసీపీ అభ్యర్థి మేరీగ సుమతికి మద్దతుగా ఓటర్ల విస్తృత ప్రచారం