01/11/2026, Sunday · 06:37:30 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

చిన్న పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం

Kadiyala Chinmaya Reddy 01/11/2026 5:45 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 2

చిన్న పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం
Want this news as a newspaper clip?Print News Clip
  • ఈదూరు ఎంపీటీసీ సెగ్మెంట్‌లోనే రూ.17 కోట్లకు పైగా ప్రయోజనం
  • అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం.. కూటమి అభ్యర్థులను గెలిపించండి
  • వైసీపీ నేతల గత పాలనను గమనించి ఓటు వేయండి
  • ఈదూరులో ఎన్నికల ప్రచారంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

తోటపల్లిగూడూరు,(అక్షర దర్శిని): చిన్న పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తోటపల్లిగూడూరు మండలం ఈదూరు ఎంపీటీసీ సెగ్మెంట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు లభిస్తున్న ప్రయోజనాలను వివరించారు. ఈదూరు సెగ్మెంట్‌లో సంక్షేమ పథకాల ద్వారా రూ.10.41 కోట్ల మేర లబ్ధి చేకూరగా, అభివృద్ధి పనుల విలువ రూ.7 కోట్లకు పైగా ఉందని తెలిపారు. మొత్తం మీద రూ.17 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరడమే ఇందుకు నిదర్శనమన్నారు.

సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి

ఈదూరు సెగ్మెంట్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా రూ.6.57 కోట్లు, తల్లికి వందనం పథకం ద్వారా రూ.1.24 కోట్లు, అన్నదాత సుఖీభవ ద్వారా రూ.1.95 కోట్లు, మత్స్యకారుల సేవలో పథకం కింద రూ.22.66 లక్షలు, ఆటో డ్రైవర్లకు రూ.4.35 లక్షలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా రూ.35.60 లక్షలు లబ్ధి చేకూరినట్లు సోమిరెడ్డి వివరించారు. అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందని పేర్కొన్నారు.

రూ.7 కోట్లకు పైగా అభివృద్ధి పనులు

ఈదూరు ప్రాంతంలో అభివృద్ధి పనులపై మాట్లాడుతూ.. తోటపల్లిగూడూరు-సాలిపేట రహదారి నిర్మాణానికి రూ.3.60 కోట్లు వెచ్చిస్తున్నామని, రూ.36 లక్షలతో విలేజ్ హెల్త్ కేర్ సెంటర్, రూ.90 లక్షలతో సీసీ రోడ్లు, రూ.70 లక్షలతో ఆర్వో ప్లాంట్లు, రూ.కోటితో త్రీఫేజ్ విద్యుత్ లైన్లు, రూ.6 లక్షలతో కల్వర్టు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వీటితో పాటు సోలార్ లైట్ల ఏర్పాటు వంటి పనులు కూడా చేపట్టామన్నారు.

సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణకు రూ.50 కోట్లు మంజూరు చేయించామని, పన్నులు మినహాయించిన అనంతరం రూ.36 కోట్ల నికర విలువతో పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.

వైసీపీపై విమర్శలు

ప్రజల కోసం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని సోమిరెడ్డి విమర్శించారు. కల్తీ మద్యం, అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ పాలనపై ఆరోపణలు చేశారు. జాతీయ రహదారులు, సాగరమాల ప్రాజెక్టులు, రైల్వే పనులకు గ్రావెల్ తరలింపుపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఒక్కో ట్రక్కు గ్రావెల్ తరలింపునకు సీనరేజీ రూపంలో సుమారు రూ.1,700 వరకు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.

కూటమి అభ్యర్థులకు మద్దతివ్వండి

ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని సోమిరెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, మంత్రి నారా లోకేశ్ విద్యారంగంలో మార్పులతో పాటు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే గ్రామాల్లో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ఈదూరు, మండపం ఎంపీటీసీ సెగ్మెంట్ అభ్యర్థి వెంపులూరు మనోహర్‌తో పాటు జెడ్పీటీసీ అభ్యర్థి జానా రజనిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి అభివృద్ధికి మరింత ఊతమివ్వాలని సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి :: ఆదురుపల్లిలో పిడుగుపాటు.. స్వీట్ షాప్ గోడౌన్ చిమ్నీ ధ్వంసం

చిన్న పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం
చిన్న పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం
చిన్న పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం

DevelopmentWelfareVillagesCroresRupees

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

81 Posts

Latest News

బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు..! అల్లీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సోమిరెడ్డి బహుజనులు రాజ్యాధికారం సాధించాలి.. అంబేద్కర్ ఆశయాలను నిజం చేయాలి – నిజమాల ప్రసాద్ అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సామాన్య ఓటర్లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు: కాకాణి రాపూరు బిట్‌-2లో వైసీపీ అభ్యర్థి మేరీగ సుమతికి మద్దతుగా ఓటర్ల విస్తృత ప్రచారం రాపూరు బిట్‌-2లో వైసీపీ అభ్యర్థి మేరీగ సుమతికి మద్దతుగా ఓటర్ల విస్తృత ప్రచారం