28/10/2026, Wednesday · 09:13:30 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

పొదలకూరు మండలానికి నేను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదు:సొమిరెడ్డి

hameed 28/10/2026 7:06 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 1

పొదలకూరు మండలానికి నేను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదు:సొమిరెడ్డి
Want this news as a newspaper clip?Print News Clip
  • అభివృద్ధి కొనసాగాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి*
  • జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి*
  • సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి*

పొదలకూరు,అక్షరదర్శిని,:* మండలానికి తాను చేసినంత అభివృద్ధి మరెవరూ చేయలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ కాలువను తీసుకొచ్చి మెట్ట భూములను మాగాణిగా మార్చిన ఘనత తనదేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పొదలకూరు మండలంలోని తాటిపర్తి, నల్లబాలెం గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్‌రెడ్డి, తాటిపర్తి బిట్‌-1 ఎంపీటీసీ అభ్యర్థి కసిరెడ్డి పుష్పవేణి, బిట్‌-2 అభ్యర్థి పల్లవరపు కృష్ణయాదవ్‌లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాటిపర్తి ప్రజలు టీడీపీకి భారీ మెజార్టీ ఇచ్చి తనను గెలిపించారని గుర్తుచేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు సాగునీటి కోసం ఇబ్బందులు పడిన మెట్ట ప్రాంత రైతులకు దక్షిణ కాలువ ద్వారా సాగునీటి సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. పొదలకూరు మండల అభివృద్ధిలో తనదైన ముద్ర వేశానని చెప్పారు.

అభివృద్ధికి అండగా నిలవండి

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని సోమిరెడ్డి తెలిపారు. గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే స్థానిక సంస్థల్లోనూ టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. పొదలకూరు మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకునేలా ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థులు కసిరెడ్డి పుష్పవేణి, పల్లవరపు కృష్ణయాదవ్‌లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సైకిల్ గుర్తుకు వేసే ప్రతి ఓటు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. ప్రజల ఆశీస్సులతో స్థానిక సంస్థల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :: చేజర్ల మండలంలో తొమ్మిది ఎంపిటిసి సెగ్మెంట్ ఏకగ్రీవం

పొదలకూరు మండలానికి నేను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదు:సొమిరెడ్డి

Mandal SomireddydevelopmentPodalakur

About the author

hameed

hameed

Reporter

8 Posts

Latest News