స్థానిక సంస్థల ఎన్నికలకు 74 మంది మైక్రో అబ్జర్వర్లు

నెల్లూరు,(అక్షర దర్శిని):
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి మైక్రో అబ్జర్వర్ల కేటాయింపు ప్రక్రియను మంగళవారం ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి ఆధ్వర్యంలో రాండమైజేషన్ పద్ధతిలో నిర్వహించారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల విధుల నిర్వహణ కోసం మొత్తం 74 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. వీరిలో 62 మందిని ప్రధాన విధులకు, మరో 12 మందిని రిజర్వ్‌గా నియమించారు.
మున్సిపాలిటీల వారీగా ఆత్మకూరుకు 14 మంది, బుచ్చిరెడ్డిపాళెంకు ఐదుగురు, నెల్లూరు నగరపాలక సంస్థకు 55 మంది చొప్పున మైక్రో అబ్జర్వర్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తోడ్పడటం లక్ష్యంగా ఈ కేటాయింపులు చేపట్టారు.ఈ కార్యక్రమంలో సీపీఓ లక్ష్మీ నరసింహం, ఏపీఐఐసీ జెడ్‌ఎం శివకుమార్, శోభారాణి, ఎన్‌ఐసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :: పొదలకూరు ఎంపీటీసీ అభ్యర్థులకు విజ్ఞప్తి..















