వావిలేరు ఎంపీటీసీగా గోనుగుంట సుశీల ఏకగ్రీవ ఎన్నిక

- టిడిపి నాయకుల హర్షం
చేజర్ల మండలం వావిలేరు సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి గోనుగుంట సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రత్యేక అధికారి బొడ్డు ప్రసాద్ బాబు ఆమెకు ఎన్నికైనట్లు ధ్రువీకరిస్తూ డిక్లరేషన్ అందజేశారు. పోటీలో ఇతర అభ్యర్థులు లేకపోవడంతో సుశీల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు నాయకులు, పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని స్థానికులు ఆకాంక్షించారు. ఏకగ్రీవ ఎన్నికతో వావిలేరు సెగ్మెంట్‌లో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఇవి కూడా చదవండి :: కూటమి ప్రభుత్వంలో పంచాయతీ పాలన నిర్వీర్యం...వెంకీ యాదవ్












