అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు

పొదలకూరు,(అక్షర దర్శిని):
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ వినాయక, కామాక్షి తాయి రామలింగేశ్వర దేవస్థానంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కుమార్ స్వామి అయ్యప్ప స్వామితో పాటు వినాయకుడు, శివయ్య, కామాక్షమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు.
అనంతరం షేక్ సుల్తాన్ (పిటిడి) కానిస్టేబుల్ అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు ఆయనను కండువాతో సత్కరించి, పూలమాలతో అభినందించారు. భక్తి భావంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గురుస్వామి, శివాడ పరంధామి రెడ్డి, బ్రహ్మదేవి రాజశేఖర్, గోళ్ళ రమణయ్యతో పాటు పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :: చేజర్ల మండలంలో తొమ్మిది ఎంపిటిసి సెగ్మెంట్ ఏకగ్రీవం














