28/10/2026, Wednesday · 11:02:39 AM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

అక్షర దర్శిని పత్రికలో కథనానికి స్పందన.

shafi 28/10/2026 9:43 AM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 9

అక్షర దర్శిని పత్రికలో కథనానికి స్పందన.
Want this news as a newspaper clip?Print News Clip
  • నెల్లూరు జిల్లా కలువాయి మండలం కండాపురం వద్ద రహదారి దుస్థితిపై అక్షరదర్శిని పత్రికలో కథనం.
  • భారీ గుంతతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై స్పందించిన సంబంధిత అధికారులు.
  • కథనం వెలువడిన వెంటనే దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేపట్టిన అధికారులు.
  • ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర కీలకం.. అక్షరదర్శిని కథనంపై స్థానికుల హర్షం.

నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతలాత్మకూరు నుంచి కలువాయి వెళ్లే మార్గంలో కండాపురం వద్ద రహదారి దుస్థితిపై అక్షరదర్శిని పత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ ప్రచురించిన కథనంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించి దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేపట్టారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు కొంత ఊరట లభించింది.

కండాపురం వద్ద ప్రధాన రహదారి మధ్యలో భారీ రంధ్రం ఏర్పడటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, రాత్రి వేళల్లో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంత కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో వాహనదారులు తాటిమట్టలు, కర్రలు ఏర్పాటు చేసి ఇతరులను అప్రమత్తం చేశారు. ఈ సమస్యను గుర్తించిన అక్షరదర్శిని పత్రిక ప్రజల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు ఆలస్యం చేయకుండా మరమ్మతు పనులు చేపట్టడం గమనార్హం.

ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర కీలకం అన్న విషయాన్ని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అక్షరదర్శిని పత్రికలో వచ్చిన కథనంతో రహదారి మరమ్మతులు ప్రారంభం కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఇతర సమస్యలపైనా అధికారులు తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ప్రజా సమస్యలపై ప్రచురితమైన కథనానికి స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారానికి దోహదపడటంలో అక్షరదర్శిని పత్రిక తన పాత్రను మరోసారి చాటుకుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి :: చేజర్ల మండలంలో తొమ్మిది ఎంపిటిసి సెగ్మెంట్ ఏకగ్రీవం

అక్షర దర్శిని పత్రికలో కథనానికి స్పందన.
అక్షర దర్శిని పత్రికలో కథనానికి స్పందన.

Darshani magazineResponsearticleAkshara

About the author

S

shafi

Reporter

9 Posts

Latest News