01/11/2026, Sunday · 06:40:23 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

అల్లీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సోమిరెడ్డి

Kadiyala Chinmaya Reddy 01/11/2026 5:38 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 1

అల్లీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సోమిరెడ్డి
Want this news as a newspaper clip?Print News Clip
  • ప్రజలంతా బాధ్యతగా ఓటు వేయాలి.. ప్రశాంతంగా పోలింగ్‌ జరగడం సంతోషదాయకం
  • వైసీపీ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, దాడులు ఇప్పుడు లేవు

నెల్లూరు(అక్షర దర్శిని):

నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆదివారం అల్లీపురంలోని 5వ డివిజన్‌ పీకేజీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండటం సంతోషకరమని సోమిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఎన్నికల సందర్భంగా చేసిన హడావుడికి భిన్నంగా ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు దౌర్జన్యాలు, దాడులు, అరాచకాలు ప్రస్తుతం కనిపించడం లేదని విమర్శించారు.

ఏకగ్రీవాలపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏకగ్రీవాలు జరిగితే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వబోమంటూ వైసీపీ నేతలను హెచ్చరించిన జగన్‌.. ఇప్పుడు ఏకగ్రీవాలు జరిగిన నేపథ్యంలో ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూడాలని అన్నారు.

పులివెందులలో మెజారిటీ స్థానాలు ఏకగ్రీవమైన నేపథ్యంలో జగన్‌కు ఎమ్మెల్యే సీటు దక్కుతుందా లేదా అన్నది తేలాల్సి ఉందంటూ సోమిరెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి :: ఆదురుపల్లిలో పిడుగుపాటు.. స్వీట్ షాప్ గోడౌన్ చిమ్నీ ధ్వంసం

అల్లీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సోమిరెడ్డి

his voteSomireddycastsAllipuram

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

81 Posts

Latest News

బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు..! చిన్న పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం బహుజనులు రాజ్యాధికారం సాధించాలి.. అంబేద్కర్ ఆశయాలను నిజం చేయాలి – నిజమాల ప్రసాద్ అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు బైక్‌పై పర్యటిస్తూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సామాన్య ఓటర్లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు: కాకాణి రాపూరు బిట్‌-2లో వైసీపీ అభ్యర్థి మేరీగ సుమతికి మద్దతుగా ఓటర్ల విస్తృత ప్రచారం రాపూరు బిట్‌-2లో వైసీపీ అభ్యర్థి మేరీగ సుమతికి మద్దతుగా ఓటర్ల విస్తృత ప్రచారం