02/11/2026, Monday · 01:53:38 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

పులివెందులలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు.

Kadiyala Chinmaya Reddy 02/11/2026 11:25 AM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 2

పులివెందులలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు.
Want this news as a newspaper clip?Print News Clip
  • వైసీపీ ఏజెంట్లను అడ్డుకున్నారు – డాక్టర్ మెరిగ రేవంత్ చక్రవర్తి....

రాపూరు,అక్షర దర్శిని):

నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు డాక్టర్ మెరిగ రేవంత్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లగా, ఆయన ఓటు వేయకుండా అనేక విధాలుగా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అంతేకాకుండా సుమారు 70 పోలింగ్ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను అనుమతించకుండా అడ్డుకున్నారని, టీడీపీ ఏజెంట్లు దొంగ ఓట్లు వేసినట్లు ఆరోపించారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, బ్రిటిష్ పాలనను తలపించే విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పరిణామాలు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కూటమి పార్టీ పాలనలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని డాక్టర్ మెరిగ రేవంత్ చక్రవర్తి ఆరోపించారు.

ఇవి కూడా చదవండి :: అల్లీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సోమిరెడ్డి

PulivendulaDemocracydisrupted

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

82 Posts

Latest News

మురాసు తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అయ్యప్ప టీడీపీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం. పాతపాడు, ఓబులయపల్లిలో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం మాముడూరులో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం బీసీ లే పార్టీకి వెన్నుముక... సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి . బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు..! చిన్న పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం అల్లీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సోమిరెడ్డి బహుజనులు రాజ్యాధికారం సాధించాలి.. అంబేద్కర్ ఆశయాలను నిజం చేయాలి – నిజమాల ప్రసాద్ అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు