02/11/2026, Monday · 06:47:11 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

చేజర్లలో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు మంత్రి ఆనం పిలుపు

sulthan 02/11/2026 5:58 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 3

చేజర్లలో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు మంత్రి ఆనం పిలుపు
Want this news as a newspaper clip?Print News Clip
  • తూర్పుపల్లి నుంచి వైసీపీ నుంచి టిడిపిలో చేరిన పది కుటుంబాలు
  • పార్టీ కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించిన మంత్రి ఆనం
  • భారీ మెజారిటీతో జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించాలని కోరిన మంత్రి ఆనం

చేజర్ల మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటించారు. టీడీపీలో చేరిన అనంతరం మాజీ ఎంపీపీ తూమాటి విజయ్ భాస్కర్ రెడ్డి ఇంటికి తొలిసారి వెళ్లి పరామర్శించారు. అనంతరం మాజీ సర్పంచ్ రావి లక్ష్మీ నర్సారెడ్డి నివాసంలో ఏకగ్రీవమైన 9 మంది ఎంపీటీసీలు, ఎంపీటీసీ అభ్యర్థి రాంపాటి అంకమ్మ, జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లీశ్వరితో పాటు మండల నాయకులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి అభ్యర్థులుగా భావించి కష్టపడి పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా తూర్పుపల్లి గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన పది కుటుంబాలు టీడీపీలో చేరగా, మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు తాళ్లూరు గిరినాయుడు, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, మండల అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :: టీడీపీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం.

చేజర్లలో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు మంత్రి ఆనం పిలుపు
చేజర్లలో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు మంత్రి ఆనం పిలుపు

anam pilupuchejarlalotidipiabhyarthulagelupunakumamtri

About the author

Latest News

పెన్నబద్వేల్‌లో టీడీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం. సర్వేపల్లిలో కూటమి క్లీన్ స్వీప్ ఖాయం.. మురాసు తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అయ్యప్ప పులివెందులలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం. పాతపాడు, ఓబులయపల్లిలో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం మాముడూరులో జడ్పీటీసీ అభ్యర్థి రావి మల్లేశ్వరి ఇంటింటి ప్రచారం బీసీ లే పార్టీకి వెన్నుముక... సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ధనుంజయ రెడ్డి . బిరదవోలులో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు..! చిన్న పల్లెల్లోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం