04/11/2026, Wednesday · 02:36:11 PM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. ఎస్ఐ కోటయ్య

shafi 04/11/2026 1:11 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 2

ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. ఎస్ఐ కోటయ్య
Want this news as a newspaper clip?Print News Clip

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కలువాయి మండల ప్రజలు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ కోటయ్య సూచించారు. ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ సమయంలో ఎలాంటి సభలు, ర్యాలీలు, మైకుల వినియోగం, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. టీవీ, రేడియో, సోషల్ మీడియా వేదికగా కూడా ఎన్నికల ప్రచారం చేయకూడదని పేర్కొన్నారు. ఓటర్లు కాని బయటి వ్యక్తులు నియోజకవర్గ పరిధిలో ఉండరాదని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా మద్యం పంపిణీ, డబ్బుల పంపిణీ వంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా చోటుచేసుకుంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్ఐ కోటయ్య విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి :: వావిలేరులో జడ్పిటిసి అభ్యర్థి విజయానికి ప్రచారం

Election rulesfollowedKotayya

About the author

S

shafi

Reporter

24 Posts

Latest News