04/11/2026, Wednesday · 09:50:13 AM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

టీడీపీలో కష్టానికి గుర్తింపు లేదు

Kadiyala Chinmaya Reddy 04/11/2026 7:36 AM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 7

టీడీపీలో కష్టానికి గుర్తింపు లేదు
Want this news as a newspaper clip?Print News Clip

రాపూరు,(అక్షర దర్శిని):

నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు ఈగ రాజారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీలో తగిన గుర్తింపు లభించకపోవడంతో పార్టీని వీడినట్లు ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ ఎస్సీఈసీ సభ్యులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఈగ రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. డియర్ పార్టీ పెట్టినప్పుడు నుంచి టిడిపిలో కొనసాగుతున్నానని, గత మూడు సంవత్సరాల నుంచి టీడీపీపార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశానని, గోనుపల్లి పంచాయతీలో తన సొంత నిధులతో ప్రజలకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించానని తెలిపారు. పార్టీతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ టీడీపీ తన సేవలను గుర్తుంచుకోగా అనేక అవమానాలను ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

గుర్తింపు లేని చోట కొనసాగడం వల్ల నన్ను నమ్ముకున్న మనుషులకు న్యాయం చేయలేననే ఉద్దేశంతోనే టిడిపి పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరినట్లు వెల్లడించారు. తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజాసేవను మాత్రం విడిచిపెట్టనని, ప్రజల అభిమానం తనకు ముఖ్యమని ఈగ రాజారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు నెల్లూరు గిరిధర్ రెడ్డి బిరుదురి శ్రీనివాసులు,రమేష్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :: వావిలేరులో జడ్పిటిసి అభ్యర్థి విజయానికి ప్రచారం

recognitionhardshipTDP

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

87 Posts

Latest News