04/11/2026, Wednesday · 09:45:52 AM About UsPrivacy PolicyContact Us
Akshara Darshini

నెల్లూరు మేయర్‌గా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ఘన విజయం!

Kadiyala Chinmaya Reddy 04/11/2026 8:23 AM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 4

నెల్లూరు మేయర్‌గా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ఘన విజయం!
Want this news as a newspaper clip?Print News Clip
  • 80,170 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం.. కూటమి శ్రేణుల్లో సంబరాలు

నెల్లూరు,(అక్షర దర్శిని):

 నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌గా కూటమి అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల్లో ఆయనకు 80,170 ఓట్ల మెజారిటీ లభించినట్లు సమాచారం. ఈ విజయంతో కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

నగరంలో జరిగిన ఎన్నికల్లో రూప్ కుమార్ యాదవ్‌కు ప్రజల నుంచి విశేష మద్దతు లభించిందని కూటమి నాయకులు పేర్కొన్నారు. ఆయన విజయంతో నెల్లూరు నగర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విజయం అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహిస్తూ రూప్ కుమార్ యాదవ్‌కు అభినందనలు తెలిపారు. నగర ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని ఆయన పేర్కొన్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి :: వావిలేరులో జడ్పిటిసి అభ్యర్థి విజయానికి ప్రచారం

Nellore MayorRoopKumarYadavsworninas

About the author

Kadiyala Chinmaya Reddy

Kadiyala Chinmaya Reddy

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

87 Posts

Latest News