కలువాయిలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల.

నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల కలువాయిలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ వెంట సీఐ వేణుగోపాల్ రెడ్డి, కలువాయి ఎస్ఐ కోటయ్య, పోలీసు సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి :: కనీస వసతులు కరువు.. ఎన్నికల సిబ్బంది ఆవేదన!*















